టీయూడబ్ల్యూజే (ఐజెయూ)జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ కు సత్కారం…

జర్నలిస్టుల కృషి అభినందనీయం – ..డా. సత్యం శ్రీరంగం.
కూకట్ పల్లి( జనంసాక్షి ): టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ గడ్డమీది బాలరాజు గౌడ్ బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ ను ఆయన శాలువాతో సత్కరించి మెమొంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ జర్నలిస్ట్ మిత్రులందరూ ఎండను, వానను సైతం లెక్క చేయకుండా సమాజంలో జరుగతున్న వాస్తవ సంఘటలను పత్రికల ద్వారా, ప్రజా మాధ్యమాల ద్వారా ప్రసారం చెయ్యడానికి సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చెయ్యడంలో ఎంతో కష్ట పడుతున్నారని అన్నారు.జర్నలిస్టుల సమస్యల పై బాల్ రాజ్ ఐక్యంగా పోరాటం చేయాలనీ అన్నారు. జర్నలిస్ట్ ల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు ఖరీం, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు తేళ్ల హరి క్రిష్ణ, జర్నలిస్టులు మిత్రులు నర్సింహా, తిరుపతి, రాము తదితరులు పాల్గొన్నారు.



