టీ20 ప్రాథమిక జట్టులో యువీకి చోటు

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ వ్యాధికి విదేవాల్లో చికిత్స చేయించుకొని పూర్తిగా కోలుకున్న యువరాజ్‌సింగ్‌కు ఐసీసీ వర్డల్‌ టీ20 ప్రాథమిక జట్టులో చోటు లభించింది. శ్రీలంకలో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ వరల్డ్‌ టీ20కి ప్రాథమిక జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. ఇందులో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌సింగ్‌లతో కలిసి 30 మంది సభ్యులకు చోటు కల్పించారు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచిన అంబటిరాయుడు, మనదీప్‌ సింగ్‌లకు కూడా జట్టులో స్ధానం లభించింది.