ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతి

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలంలోని లెక్కలవారిపల్లెలో ట్రాక్టర్‌ కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. పొలం వద్దకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో బాలిక కూడా ఎక్కింది. ఇంజిన్‌ పై కూర్చున్న బాలిక కుదుపులకు ట్రాక్టర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.