ట్రాన్స్ఫారాల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రాజంపేట్ మార్చి 4 (జనంసాక్షి)
రాజంపేట్ మండల రైతుల కు పోలీస్ వారి సూచన ట్రాన్స్పరాల దొంగల ముఠా మన జిల్లాలోకి వచ్చి గత 20 రోజుల నుండి  దాదాపుగా 17 ట్రాన్స్ఫారం లు దొంగతనం చేయడం జరిగింది.   పోలీస్ తరఫున రెండు ప్రత్యేక టీం లు వారిని పట్టుకొనుట గురించి శ్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి  మండలంలోని రైతు సోదరులందరికీ నేను తెలిపేది ఏమనగా ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు మన  పొలాల వైపు గానీ, మన గ్రామాల వైపు వచ్చిన వెంటనే 100 నంబర్ కి గానీ లేదా ఎస్సై  రాజంపేట్ 8712686158 ఫోన్ చేసి తెలుపగలరు.  అదేవిధంగా మీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచుకోగలరు అని పోలీస్ శాఖ తరపున కోరుచున్నాము