డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు గడువు పెంచాలని వినతి పత్రం అందచేసిన అతహర్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తు గడువు పొడగించాలని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి ని కలిసి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అతహర్ వినతి పత్రం అందచేయడం జరిగింది.ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి పట్టణం లోని సింగన్న గూడెం లో గత ఎన్నో సంవత్సరాల కింద నిర్మించిన 444 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిరుపేదలకు కేటాయంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియచేసి వెంటనే వాటిని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేయడం తో ప్రభుత్వం దిగి వచ్చి ఆదరా బాదరా గా దరఖాస్తు లు కోరుతూ కేవలం 5 రోజుల గడువు ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటని అతహర్ ప్రశ్నించారు.మొత్తం భువనగిరి లో కేవలం 10 వరకు మీ సేవా కేంద్రాలు ఉన్నాయని అందులో ఒక రోజుకు మొత్తం 300 వరకు మాత్రమే ధరకాస్తులు అప్లోడ్ అవడం వలన మొత్తం 5 రోజులలో 1500 మంది మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది దీని వలన ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేరని వాపోయారు. అందువలన దరఖాస్తు గడువు తేది ఇంకా 10 రోజులు పొడగుంచి పేద ప్రజల పక్షాన నిలవాలని జిల్లా అదనపు కలెక్టర్ ను కోరడం జరిగిందని అన్నారు.దీనికి వారు స్పందించి కలెక్టర్ తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని అతహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు వాహేద్, నేహాల్, వసీమ్ పాల్గొన్నారు.