డబుల్ బెడ్ రూమ్ రాలేదు అన్ని ఆవేదన కు గురై గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన రజియా – ఆ కుటుంబానికి 25 లక్షలు, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి

– బి ఎల్ టి యు రాస నాయకులు ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి సదానందం
కామారెడ్డి ప్రతినిధి (జనంసాక్షి)
ఎస్కే.రజియా అనే మహిళ డబ్బుల్ బెడ్ రూమ్ రాలేదు అన్ని ఆవేదన కు గురై గుండె పోటుతో హఠాత్తుగా మరణించిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మరణించిన కుటుంబనికీ 25,లక్షలు, తక్షణమే వారికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలిలని బి ఎల్ టి యు రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి సదానందం లు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిఎల్టియు కార్యాలయంలో రాష్ట్ర నాయకులు యం,ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి, కే,సదానందం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.

5 రోజుల క్రితం కామారెడ్డి మున్సిపల్ 49 వార్డులో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కౌన్సిలర్లు డబ్బుల్ బెడ్ రూమ్ లు లక్కీ డ్రా ద్వారా పద్దతి లో తీసిన్నారు.
డ్రా లో పేరు రాలేదు అనే కారణంగా నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏ ఓ అధికారి కి వినితి పత్రం ఇస్తునావుపుడు తన గోడు డబ్బుల్ బెడ్ రోమ్ ఇవ్వాలిని, నెలకు అద్దెకు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదనతో ఏడుస్తూ వేల బోసింది. రజియా మరణానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యత వహించి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, డబుల్ బెడ్ రూమ్లో మొదటి అవకాశం కల్పించాలన్నారు.హాసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎస్ కే.రజియా (45 ) మృతిరాలకు 1 కుమారుడు అన్వర్.1కూతురు హీన, అన్వర్ కు అనారోగ్యం పిట్స్ తర్చు రావడంతో ఇబ్బంది లు పడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు పునర్వతం కాకముందే అర్హులైన వారికీ డబ్బుల్ బెడ్ రోమ్ లు ఇవ్వాలని బి ఎల్ పి, బి ఎల్ ఎఫ్, బి ఎల్ టి యు ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ. స్వామి. సమ్మరిన్. మల. లక్ష్మి. షైనాజ్. అఫ్రిన్ మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గున్నారు..