డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం సోమవారం నుండి గురువారానికి మార్పు

వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 6
గౌరవ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రేపటి నుండి ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మున్సిపల్ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమాన్ని సోమవారానికి బదులు గురువారానికి మార్చబడింది. వచ్చే వారం నుండి ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ చైర్ చైర్ పర్సన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున వికారాబాద్ పట్టణ ప్రజలు గమనించగలరు.