డాక్టర్ ధరవత్ ప్రీతిది ముమ్మాటికి ఇది హత్యే.. హెచ్ పి ఎస్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటి ఆధ్వర్యంలో డాక్టర్ ధరవత్ ప్రీతి భాయికి కోవ్వత్తుల నివాళి అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘల ,రాజకీయ ,గిరిజన నాయకులు మాట్లాడుతు ప్రీతి భాయిదీ ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని చేప్పడం జరిగింది.ప్రభుత్వం సరియైన సమయంలో స్పందించకపోవడంతో ఈ దారుణం జరిగిందన్నారు..ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని సైఫ్ మరియు కోంత మంది ప్రమేయంతో హత్య చేసినట్టుగా భావిస్తున్నమన్నారు.ఈ హత్యపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి,హేజ్ వో డి,ప్రిన్స్ పాల్ మరియు సైఫ్ పై హత్యనేరం కెసు నమెదు చేయాలి. ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కమిటి డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్ ,భాస్కర్ నాయక్ ,కాంగ్రెస్ నాయకులు ప్రమెద్ కుమార్ ,బర్రె జాంగిర్ ,ఈరపాక నర్సింహ్మ బట్టు రాంచందర్ ,శివలింగం,కోడారి వెంకటేష్ , బర్రె సుదర్శన్ రత్నపురం బలారం,ప్రదిప్ ఎమ్మార్పీఎస్ దేవేందర్ బిసి సంఘం రావుల రాజు,చత్రు నాయక్ ,కర్తాల శ్రీనివాస్ ,రాంబాయి ,బాలన్ నాయక్ తదితరులు పాల్గోన్నారు