డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌, జూలై 27 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ శుక్రవారం నాడు డిటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా డిటిఎఫ్‌ నాయకులు శంతన్‌ మాట్లాడుతూ, అప్‌గ్రేడ్‌ భాషా పండితులకు నష్టం కలిగించే 1/ 2005 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్పెషల్‌ టీచర్ల సర్వీసుకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు బదిలీల కోడ్‌ రూపొందించాలని, ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని ఆయన కోరారు. ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లకే రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని విరమించుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన కోరారు.