వాకిటి లక్ష్మమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

భూదాన్ పోచంపల్లి, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని గౌస్‌కొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కందుకూరి కిషన్ తండ్రి నరసింహ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకిటి బాల్ రెడ్డి, జంగారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి వాకిటి లక్ష్మమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునుకుట్ల నరేష్ గౌడ్, నోముల శ్రీనివాస్ రెడ్డి, పాండాల వెంకటేష్, లింగాల మధు, శంకర్, గోపగోని దేవానంద్, దుబ్బాక లింగస్వామి, కందుకూరి సైదులు, స్వామి, వంగూరి స్వామి, పరమేష్, యాదగిరి, అనిల్, సుమన్, మల్లేష్, రవి, కృష్ణ, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.



