డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు విద్యార్థుల మృతి

హైదరాబాద్(జ‌నం సాక్షి):బర్త్‌ డే పార్టీకి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన నార్కట్‌పల్లి శివారులో జరిగింది. మిర్యాలగూడలో ఉన్న తమ మిత్రుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మోటార్‌ సైకిల్‌పై బయలుదేరారు. అయితే… నార్కట్‌పల్లి శివారులో హైవేపై బైపాస్‌లో అర్ధరాత్రి బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.