డిసెంబరు 28లోపే పార్టీలు తమ వైఖరిని స్పష్టంచేయాలి: నాగాం జనార్దనరెడ్డి

హైదరాబాద్‌: డిసెంబరు 28 లోపే కాంగ్రెస్‌, తెదేపా, వైకాపాలు తెలంగాణపై తమ వైఖరిని ప్రజల ముందు స్పష్టం చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. ఓట్లేసిన ప్రజల ముందు నోరువిప్పకుండా అఖిలపక్షానికి చెబుతామనడం మరో మోసానికి నిదర్శనమని విమర్శించారు. అఖిల పక్ష సమావేశంలో మయోపాయం చేసేందుకు ప్రయత్నించే పార్టీల జెండాలను, గద్దెలను తెలంగాణలో భూస్థాపితం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 16న జరిగే సమావేశంలో తెలంగాణ మంత్రులు తెలంగాణపై చిర్చంచాలని డిమాండ్‌ చేశారు.