డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల కొనసాగించడానికి వీలులేకుండా బీసీలు, ముస్లింలు, వికలాంగులను కలుపుకుని ఈనెల 17 నుంచి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి డిసెంబరు 4న హైదరాబాద్‌లో పార్టీని ప్రకటించనున్నట్లు చెప్పారు. భధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఐఎఎస్‌లను కాల్చిపారేయాలన్న మంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు.