డీఎంకే జైల్‌ భరో: కనిమొళి, స్టాలిన్‌, మారన్‌ అరెస్టు

చైన్నై: ఈ రోజు డీఎంకే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జైల్‌ భరో కార్యక్రమంలో కనిమొళి, స్టాలిన్‌, దయానిధిమారస్‌లతో సహా పలువురు పార్టీ నేతలు అరెస్టయ్యారు. జయలలిత ప్రభుత్వం డీఎంకే పార్టీ నేతల పై కేసులు పేట్టి వేధిస్తున్నందుకు నిరసనగా వారీ కార్యక్రమం చేపట్టారు. జయలలిత అధికారంలోకి వచ్చినప్పటినుంచి 15 మంది డీఎంకే నేతలు, మాజీ మంత్రులపై భూ ఆక్రమణ కేసులు, అక్రమాస్తుల కేసులు పెట్టి, ఇళ్లలో సోదాలు చేసి, అరెస్టులు చేయడం జరిగిందని డీఎంకే ఆరోపిస్తోంది.