డీజిల్‌ ధరను తగ్గించాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: పెరిగిన డీజిల్‌ ధరలతో రైతుపై మరింత ఆర్థిక భారాన్ని మోపి నట్లైందని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సామాన్య మానవుని వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17నుంచి 25వరకు దేశవ్యాప్తంగా భాజపా ఆందోళన చేస్తుందని ఆయన చెప్పారు.