డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి
విశాఖ: ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధతి పెరిగింది. దీంతో జలాశయం 4 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏవీపీ డ్యాం నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.