డ్రా దిశగా నాగ్‌పూర్ టెస్టు
నాగ్‌పూర్: భారత్ గడ్డపై 27 సంవత్సరాల తర్వాత తొలి టెస్టు సీరిన్‌ను గెలుచుకోవడానికి ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్‌లో జరగుతున్న నాల్గో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 326 పరుగులకు డిక్లేర్ చేసింది. నాల్గో టెస్టులో భారత్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన్నప్పటికీ సీరీస్‌ను దక్కించుకోనుంది