ఢిల్లీలో కిషన్‌రెడ్డి దీక్ష ప్రారంభం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశ రాజధానిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్‌రెడ్డి చేపట్టిన సత్యగ్రహ దీక్ష ప్రారంభమైంది. భాజపా సీనియర్ నేత రాజ్‌నాధ్‌సింగ్ కిషన్‌రెడ్డి మెడలో పార్టీ ండువా వేసి దీక్షను ప్రారంభించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం దీక్షకు మద్దతు తెలియజేశారు. ఈ దీక్షకు రాష్ట్ర నేత విద్యాసాగర్‌రావుతోపాటు పలువురు హాజరయ్యారు.