ఢిల్లీ మెట్రో రైల్‌ లో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకూ మెట్రో రైలులో ప్రతిభా పాటిల్‌ ప్రయాణించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… దేశం అభివృద్ధి చెందుతోందనడానికి ఢిల్లీ మెట్రో రైలునిదర్శనమని వ్యాఖ్యానించారు.