తండ్రికి తగ్గ తనయుడు
తండ్రికి తగ్గ తనయుడుశ్రీసీతారామ మందిరానికి కావాల్సిన ఇసుక, సిమెంట్ ఇస్తానని పోచారం భాస్కర్ రెడ్డి హామీ
రుద్రుర్(జనంసాక్షి): రుద్రుర్ మండల కేంద్రంలోని శ్రీ సీతా రామ మందిర నిర్మాణనికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తే, ఆయన తనయుడు డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ర్శ్రీసీతారామ మందిరానికి కావాల్సిన ఇసుక, సిమెంట్ తానే ఇస్తానని పోచారం భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారని, పత్తి రాము, తెలిపారు, పూర్తి వివరాలలోకి వెళ్తే, సభాపతి మంజూరు చేసిన నిధులకు కృతజ్ఞతతో బుధవారం రోజున పోచారం భాస్కర్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి వెళ్లిన శ్రీరామ కమిటీ సభ్యులకు శ్రీసీతారామ ఆలయ నిర్మాణం గురుంచి తెలుసుకొని , తనవంతు సహాయంగా మందిర నిర్మాణనికి కావలసిన ఇసుక , సిమెంట్ పంపిస్తానని తెలుపగానే శ్రీరామ్ మందిర్ కమిటి వారు ఆనందం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ పత్తి రాముపత్తి నవిన్, అడపా నవీన్, అడపా వినోద్, అడపా శ్రీనివాస్, జువ్వల శ్రవణ్, కల్యాణ్, బి కృష్ణ , బచ్చు శ్రావణ్ పాల్గొన్నారు