ధరలపై తెలుగు మహిళ పోరు:శోభా హైమావతి

విశాఖపట్నం:నాటికి పేరుగుతున్న నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలపై పోరు సాగించన్నట్లు తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వెల్లడించారు.ఈరోజు ఆమె మూట్లాడుతూ ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.అన్నిరకాల వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయని,మధ్య తరగతి ప్రజలకు బతుకు దుర్లభంగా మారిందని పేర్కొన్నారు.ఈ ధరల పెరుగుదలను నిరసిస్తూ వచ్చే వారం నుంచి ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.