తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాల యం లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.రెండో రోజైన శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ,ఆలయ సాంప్రదాయం పద్ధతి లో అర్చకులు,వేద పండితుల వివరించిన విధంగా తలపాగా చుట్టించుకొని,నుదుట తిలకం దిద్దించుకొని,స్వామివారి దర్శించుకొనితీర్థప్రసాదాలు స్వీకరించి,పట్టు వస్త్రాలు, తలంబ్రాల పళ్లెం,తలపై పెట్టుకుని మంగళ,వాయిద్యాలు , వేదమంత్రాలు పటిస్తుండగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందించారు.ధర్మపురి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తమున శేషప్ప కళావేదిక పైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వాముల కల్యాణోత్సవం జరగనుంది.ఈ కళ్యాణ మహోత్సవంను తిలకించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు ధర్మపురి కి చేరుకున్నారు.నిజామాబాద్, నాందేడ్, నాగపూర్, చంద్రాపూర్ ఇతర రాష్ట్రాల నుండి, భారీ సంఖ్య లో భక్తులు వస్తున్నారు.ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకూ భక్తులకు ఉచిత అన్నదాన కొనసాగనున్నది. బ్రహ్మోత్సవాలు హాజరైన భక్తులు ఉచిత అన్నదాన ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, వైస్ చైర్మన్ అక్కన పెళ్లి సునీల్,అధికారులు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.కళ్యాణంను తిలకించేందుకు 6 డిజిటల్ స్క్రీన్ లు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటుధర్మపురి బ్రహ్మోత్సవాలలో ముఖ్యగట్టమైనశ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ తిలకించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మార్గదర్శనం మేరకు ధర్మపురి పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.ఆలయంలో కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులందరికీ అవకాశం లేకపోవడంతో ఈ అపురూప ఘట్టాన్ని ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా తిలకించేందుకు వీలుగాఈ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.ఆలయం లోపల రెండు ,ఆలయం బయట ఒకటి,ఇసుక స్తంభం వద్ద ఒకటి, నంది విగ్రహం వద్ద ఒకటి, మంగళ్లి ఘాటు వద్ద ఒకటి ఇలా మొత్తం ఆరు ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.