తల్లిదండ్రులు లేని పేద అమ్మాయి వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన ఎంపిటిసి దంపతులు
జనం సాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు పొలంసమ్మయ్య – కీర్తిశేషులు నరసమ్మ ఏకైక పుత్రిక లావణ్య- విష్ణువర్ధన్ వివాహానికి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ 5116 రూపాయలు ఆర్థిక సహాయం అందించి , బీద కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.