తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి దీక్ష

తిరుపతి:అధ్యాత్మిక నగరమైన తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు.షిర్డీ తరహలో శ్రీవారి పాదల చెంత ఉన్న తిరుపతిని కూడా మద్యరహిత నగరంగా మార్చి భక్తుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.శ్రీనివాసం యాత్రికుల సముదాయం వద్ద ఆయన దీక్ష ప్రారంబించారు.ప్రభుత్వం దిగివచ్చి మద్య నిషేదం అమలుపై హమీ ఇచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.