తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్ ను ఖండించిన అతహర్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
క్యూ న్యూస్ ఛానల్ అధినేత జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అరెస్ట్ ను వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా అతహర్ విలేకరుల తో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని నీలాదిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దొర తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే వారు ఉండొద్దనే ఉదేశ్యం తో ఇటు ప్రతి పక్షాల అటు జర్నలిస్ట్ ల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో కేసీఆర్ ఒక నియంత లాగ వ్యవహారిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తుంటే దాన్ని తీన్మార్ మల్లన్న ప్రశ్నించడం తప్పా అని అన్నారు. ఎప్పటి వరకు ఇలా ప్రశ్నించే గొంతుకలను నొక్కుతారని చట్టం అనేది ఒకటుందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న ను బేషరతుగా విడుదల చేయాలని లేని చో త్వరలో ప్రజలే కేసీఆర్ కు బుద్ది చెబుతారని తెలిపారు. ఇకనైనా కేసీఆర్ ఇలాంటి పనులు మానుకుని మంచి పరిపాలన పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసారు.వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ జర్నలిస్ట్ ల వెంట ఉంటుందని వారికి అన్యాయం జరిగితే ఊరుకోదని అన్నారు..