తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ వ్వవస్థ సిద్ధం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదికల్లా తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో సిద్దమవుతుందని కేంద్రం తెలిపింది. తీరప్రాంత రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పారు. దేశ తీరప్రాంతంలో అనుమనిత ఓడల గుర్తింపునకు రాడార్లు, ఎలక్రాటనిక్‌ సెన్సార్లతో ఈ నెట్‌వర్క్‌ పనిచేస్తుంది. బుధవారం రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోని ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నెట్‌వర్క్‌ మొదటి దశలో భాగంగా ఇప్పటికే 46 రాడార్లు పనిచేస్తున్నాయన్నారు.