తుపాను బీభత్సంతో చైనా

బీజింగ్‌: చైనాలో తుపాను బీభత్సం పలు రాష్ట్రాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపాలయ్యారు. లియానింగ్‌ రాష్ట్రాంలోని ఓ గ్రామంలో వంద మందికిపైగా బురదలో చిక్కుకోగా తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారని గ్జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. గ్జియాస్‌ పట్టణంలో ఆరుగురు మృతి చెందగా, విద్యుత్‌, మంచి నీరు, రవాణా సౌకర్యం లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో లక్షా పదివేల మంది నిరాశ్రయులయ్యారు. బెన్‌గ్జి పట్టణంలో నదులకు వరద రావడంతో ఓ టన్నెల్‌లో 300 మంది కార్మికులు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వారిని తాడు ద్వారా రక్షించే యత్నంలో ఉన్నారు.