తుఫాను పునరావాస కేంద్రాల నిర్మాణం

హైదరాబాద్‌: తుపాను ప్రభావత ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కమిషనర్‌ రాధ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండొ విడత రూ.533 కోట్లతో చేపట్టే పనులను అక్టోబరు 2న ప్రారంభించాలని మంత్రి అదేశించారు. ప్రాజెక్టు రెండో దఖలో భాగంగా తొమ్మిది కోస్తా జిల్లాల్లో గుర్తించిన 403 పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ఆధునిక సౌకర్యాలతో పాటు సాధారణ రోజుల్లో పెళ్లిళ్లు, సమావేశాలు నిర్వహిచుకోవడానికి వీలుగా వీటిని నిర్మించనున్నారు. తుపాను సమయంలో త్వరితగతిన పునరావాస కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా బీటీ రోడ్లను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.