తెదేపా వైఖరి బాధాకరం : లగడపాటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం వ్యవహరించడం బాధాకరమని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలుగుదేశం పుట్టిందే తెలుగువారి ఆత్మాభిమానం కోసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం తెలంగాణ అంశానికి మద్దతు ఇస్తోందన్నారు.