తెలంగాణకు కాంగ్రెస్స్‌ అడ్డు: సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపకపోతే పార్లమెంటరి వ్యవస్థకే ప్రమాదమని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.