తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదు : పాల్వాయి

హైదరాబాద్‌: సీమాంధ్ర నాయకులు అడ్డుపడినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదని, అతి త్వరలో నిర్ణయం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకునేది ప్రత్యేక రాష్ట్రమని, పార్టీలను కాదని తెలిపారు. కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అమోన్‌ మాట్లాడుతూ ప్రజలను మభ్యుపెడుతున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు నోరు మూసుకొని ఉండాలని హెచ్చరించారు.