తెలంగాణలో ఊరూవాడా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

జిల్లాల్లో జెండా ఎగురేసిన మంత్రులు

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): తెలంగాణలో స్వాతంత్యద్రినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలాడింది. గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పతాకావిష్కరణ చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయా పార్టీలు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే జిల్లాల వారీగా మంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది స్వాతంత్యద్రినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అటు శాసన మండలిలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో షబ్బీర్‌ అలీ, పొంగులేటి, రాజగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ భవన్‌లో స్వాతంత్యద్రినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ¬ంమంత్రి నాయిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర నేతలు, ముఖ్య కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు./ూజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్యదినోత్సవం సందర్భంగా జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంత్రి కేటీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంపీ వినోద్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేడుకలకు హాజరయ్యారు.

ఆదిలాబాద్‌లో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శాంతినగర్‌లో మంత్రి జోగురామన్న జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగురవేశారు. కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ సన్‌ ప్రీత్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుర్యాపేట జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి జగదీష్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌, ఎస్పీ ప్రకాష్‌ జాదవ్‌, జేసీ సంజీవరెడ్డి తదితరులు పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు.నిర్మల్‌ జిల్లాలో స్వాతంత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి మహేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎమ్మెల్యే సంజీవరావు, రామ్మోహన్‌ రెడ్డి, కలెక్టర్‌ ఓమర్‌ జలీల్‌, ఎస్పీ అన్నపూర్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి చందూలాల్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ జన సమితి కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైకోర్టు ఆవరణలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో డిప్యూటి మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌ జలమండలిలో 72వ స్వాతంత్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎండీ దానకిషోర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్‌రావు తదితరులువేడుకల్లో పాల్గొన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వేడుకలకు హాజరయ్యారు. వరంగల్‌ రూరల్‌ వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో స్వాతంత్యద్రినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అరూరి రమేష్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పెద్దపల్లి సింగరేణి ఆఫీస్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధికారులు, కార్మికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్యద్రినోత్సవాన్ని పురస్కరించుకుని చంచల్‌గూడ జైల్‌లో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విప్‌ నల్లాల ఓదెలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే దివాకర్‌ రావు, కలెక్టర్‌ కర్ణన్‌ వేడుకల్లో పాల్గొన్నారు.యాదాద్రిలో స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భువనగిరి జూనియర్‌ కాలేజీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మండలి విప్‌ నేతి విద్యాసాగర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకలకు హాజరయ్యారు.