తెలంగాణలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మలు దహనం

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ‘చలోసంగారెడ్డి’ కార్యక్రమంలో తెలంగాణ లాయర్లపై జగ్గారెడ్డి లారీఛార్జీ చేయించారని ఆరోపిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణ న్యాయవాదులు దహనం చేస్తున్నారు. నిజామాబాద్‌లో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఎల్‌ఐసీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అక్కడ జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

మహబూబ్‌నగర్‌లో జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దహనం

మహబూబ్‌నగర్‌లోనూ జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వనపర్తిలో తెలంగాణ న్యాయవాదులు జగ్గారెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారుజ తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి తన పదవికి రాజీనామా చేసి మళ్లీ సంగారెడ్డి ప్రజల తీర్పును కోరాలని వారు డిమాండ్‌ చేశారు.