తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ ఉద్యమం వెనకబడిపోయిందని, ప్రజలు, ఉద్యమకారులు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు ఉద్యమ ఎత్తుగడలను యుద్ద రూపంలోకి తీసుకురావాలని, అప్పుడే తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణాకు ప్రధాన శత్రువు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వామేనని, తెలంగాణ ప్రజలు శక్తులు ఐక్యంగా పోరాడాలని కోరారు.