తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్లు విడుదల ..
భైంసా రూరల్ మార్చ్ 01జనం సాక్షి
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సు పోస్టర్లను తెలంగాణ ఉద్యమారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమారుల కొరకు వెంటనే , తెలంగాణ ఉద్యమాకరుల సంక్షేమం బోర్డును ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయించి, తెలంగాణ ఉద్యమకారుకు విద్య, ఉపాధి , రాజకీయ అవకాశాలు కల్పించే, దిశగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండల జెఎసి నాయకులు పుప్పాల పిరాజి, వి. నాగేష్ , రాజన్న , డాక్టర్ పోశెట్టి , తదితరులు పాల్గొన్నారు.