తెలంగాణ, కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభం
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. గత డిసెంబర్ 2వ తేదీన జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కారిస్తామని ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును దిశగా నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి పెంచాలని యోచిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి పెంచాలని యోచిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలతో పాటు వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.