తెలంగాణ దీక్షాశిబారాన్ని సందర్శించిన నారాయణ

ఆదిలాబాద్‌: ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న తెలంగాణ దీక్షాశిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. దీక్షల ఉద్దేశం నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.