తెలంగాణ ప్రజల్లో మెదిలే అనుమానాలను నివృతం చేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల్లో మెదిలే ప్రశ్నలన్నింటికి సమాధానమివ్వాల్సీన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మెడికల్‌ సీట్లు కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలినాయి అనే అంశంపై కూడా పరిశీలించి తెలంగాణకు రావాల్సీన సీట్లు తెలంగాణకు కేటాయించాలని ఆయన అన్నారు.