‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’

కరీంనగర్‌: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్‌ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ హైడ్రాలజీ రిపోర్టును ఇవ్వలేదని, దాన్ని తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయబట్టారు. ఇప్పటికైనా సరే సీఎం కిరణ్‌ టెక్నికల్‌ లీగల్‌ టీంను ఢిల్లీ పంపించి హైడ్రాలజీ సర్టిఫికెట్‌ తెప్పించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.