తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ తరపున ఆపార్టీ   సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నాయిని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 66 సంవత్సరాలు అయినా గర్వించదగ్గ విషయం ఏమి లేదన్నారు. 66 సంవత్సరాల్లో ప్రజలకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని తెలియజేశారు. గిరిజనులకు, ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. హరిజనులకు, గిరిజనులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.