తెలంగాణ మార్చ్‌కు పూర్తి సంఘీభావం:దిలీప్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈ నెల 30వ తేదీన చేపట్టే తెలంగాణ మార్చ్‌కు తాము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ సెక్రటరీ జనరల్‌ దిలీప్‌ కుమార్‌ తెలియజేశారు. ఇందుకు మద్దతుగా ఈ నెల 13వ తేదీనుంచి 22వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నామన్నారు. మరో మిలియన్‌మార్చ్‌లా చలో హైదరాబాద్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రజలు కదిలిరావాలన్నారు. తెలంగాణపై జూబీలీ హాల్‌లో తాము నిన్న తల పెట్టిన మేధోమధన సమావేశానికి ప్రభుత్వం అనుమతి నివ్వకపోవడం సరికాదని, దీనిపై మండలి సమావేశంలో వాయిదా తీర్మానం ఇస్తామని , సభనుస్తంభింపచేస్తామని పేర్కొన్నారు.