తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా లాయర్లు ర్యాలీ

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’కు మద్దతుగా తెలంగాణ లాయర్లు కదం తొక్కారు. ఇవాళ వాళ్లు సాలార్‌జంగ్‌ మ్యూజియం నుంచి ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, లాయర్లకు మధ్య తోపులాట జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన లాయర్లను వెంటనే విడుదల చేయాలని అడ్వొకేట్‌ జేఏసీ డిమాండ్‌ వ్యక్తం   చేసింది.  లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.