తెలంగాణ మార్చ్‌కు సన్నాహక యాత్ర

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తల పెట్టిన ‘ తెలంగాణ మార్చ్‌’కు సంబంధించి ఆదివారం సన్నాహక యాత్రను నిర్వహించారు. తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో మాణికేశ్వర్‌నగర్‌ నుంచి యాత్ర సాగింది.