తెలుగువారి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా. -నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం అభినందనీయం.
–
-టిడిపి మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి13(జనంసాక్షి):
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు రావడంతో కొత్త చరిత్ర సృష్టించి తెలుగువారి సత్తా చాటామని తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా త్రిబుల్ ఆర్ సినిమా గురించి మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల మాట్లాడుతూ తెలుగుజాతి తెలుగు పాటకు ప్రపంచ స్థాయి ఆస్కార్ అవార్డు దక్కటం మనకెంతో గర్వకారణం అని,ఇంతటి ఘనత సాధించినందుకు రాజమౌళి, కీరవాణి,ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో పాటు మూవీ టీంకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పండుగ రోజు అని శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టమని అన్నారు తెలుగుజాతి తో పాటు దేశం మొత్తం గర్వించదగ్గ విజయమని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు రావడం ఓ చరిత్ర సృష్టించమని అన్నారు.
తెలుగువారి ఘన కీర్తిని నలుదిశల చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు అని,
ఆయన ముఖ్యమంత్రిగా తెలుగు భాషకు తెలుగువారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ అద్భుతంగా ఉందని
పోటా పోటీగా ఒకరిని మించి ఒకరు డాన్స్ చేశారని కొనియాడారు.మనమే కాదు వారి డాన్స్ కు ప్రపంచంలోనే డ్యాన్స్ ప్రియులు మంత్రముగ్ధులయ్యారని తెలిపారు.వారి శ్రమ ఫలించిందని వారి శ్రమకు ఆస్కార్ అవార్డు వరించిందని అన్నారు.విశ్వ వేదికపై అవార్డు అందుకున్న తరుణం శుభదినమని అన్నారు.ఇంతటి ఘనత సాధించిన వారందరికి నాగర్ కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సహాయక కార్యదర్శి బాలకృష్ణ జిల్లా మాజీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి జాఫర్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాము జిల్లా మాజీ కార్యవర్గ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు