తెలుగు సినిపరిశ్రమ ఆధ్వర్యంలో శోభన్‌బాబు వజ్రోత్సవం

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో సర్గీయ శోభాన్‌బాబు వజ్రోత్సవం నిర్వహించనున్నట్లు మురళీమోహన్‌ అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా హాజరవుతారని అన్నారు. ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ తన నటనతో వ్యక్తిత్వంతో ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప నటుడిగా శోబాన్‌బాబు గుర్తిండి పోతారని ఆయన అన్నారు.