తోటి ఖైదీలపై మరో ఖైదీ దాడి: ఒకరు మృతి

హైదరాబాద్‌ : చర్లపల్లి జైలులో మంగళవారం అర్థరాత్రి ఓఖైదీ వీరంగం సృష్టించాడు. దాసరి నర్సింహులు అనే ఖైదీలపై కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటయ్య అనే ఖైదీ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వెంకటయ్య గాంధీ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు జైలు అధికారులు తెలియజేశారు.