థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు
అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌, క్లూస్‌ టీం రంగంలోకి దిగాయి. నిందితుల్లో ఒకర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలియవచ్చింది. బాంబు స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. క్లూస్‌ టీం రంగంలోకి దిగింది.