దద్దరిల్లిన ఇరాక్‌ వరస బాంబుదాడులు కాల్పులు

బాగ్దాద్‌: వరస బాంబుదాడులు, కాలుపలతో ఇరాక్‌ దద్దరిల్లింది. గురువారం సాయంత్రం, శుక్రవారం జరిగిన లు దాడుల్లో 70 మందికిపైగా మృతిచెందారని ఆధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన రెండు కారుబాంబు దాడుల్లో ఏడుగురు మరణించగా 37 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌ ఉత్తర ప్రాంతంలో తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో పోలీసులు, సైనికులు మరణించారు. కిర్‌కుక్‌లో ఇద్దరు మృతిచెందగా 18 మంది గాయపడ్డారని… బాకుబా, ఫల్లుజా పట్టణాల్లో ఆరుగురు పోలీసులు మరణించారని అధికారులు వివరించారు. జఫ్రానియా జిల్లాలో గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం జరిగిన కారుబాంబు దాడుల్లో 27 మంది మృతిచెందారు. షియాలు అధికంగా ఉండే సదార్‌ పట్టణంలో 16 మంది మృతిచెందగా 40 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం జరుపుతున్న దాడులకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ సున్నీ ఉగ్రవాద సంస్థలు అల్‌ఖైదా అనుబంధ సంస్థలు చేస్తున్న దాడులుగా అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజుల్లో రంజాన్‌ పర్వదినం ఉండడంతో బాగ్దాద్‌ పట్టణంలో భధ్రత కట్టుదిట్టం చేశారు.