దించేశారు… నెగ్గిన అవిశ్వాసం.
పెద్ధూరు సింగిల్ విండో చైర్మన్ గా బేజ్జారం నారాయణ గౌడ్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17.(జనంసాక్షి). పెద్దురు సింగిల్ విండో చైర్మన్ పై సభ్యులు అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఒకరోజు ముందు చైర్పర్సన్ బర్కం లక్ష్మి రాజీనామా నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం రోజున జరిగిన సమావేశనికి క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి చేరుకున్న సభ్యులు చైర్మ పర్సన్ బర్కం లక్ష్మీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడంతో జిల్లా సహకార అధికారి బుద్ధ నాయుడు ఆమెను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక చైర్మన్ గా బెజ్జరం నారాయణ గౌడ్ ను బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మార్చ్ 20వ తేదీన తిరిగి చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆయన అన్నారు. చైర్పర్సన్ లక్ష్మి రాజీనామా విషయంలో రాజకీయ ఊహగానాలకు ఎట్టకేలకు తేరపడింది. భారతీయ జనతా పార్టీ కి జిల్లాలో మిగిలిన ఏకైక సింగిల్ విండో చైర్మన్ ను దించేసినట్లు అయ్యింది. తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ గౌడ్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గి రాముడుతోపాటు నాయకులు డైరెక్టర్లు అభినందించారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.