దుడ్డెడలో రాస్తారోకో

దుడ్డెడ: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు నిరసనగా మెదక్‌ జిల్లా దుడ్డెడ వద్ద రహదారిపై తెరాస కార్యకర్తల రాస్తారోకో నిర్వహించారు. మరికాసేపట్లో విజయమ్మ కాన్వాయ్‌ ఈ ప్రాంతానికి చేరుకోనుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.